July2019 Messages



07July2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు
Topic: పరిమళ వాసన

ఎఫెసీయులకు 5:1-2

1 కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. 2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు

**చదవబడిన వాక్యభాగములో పరిమళ సువాసన గూర్చి పరిశుద్ధగ్రంధములో వ్రాయబడిన కొన్ని మాటలను ఈరోజు మనం ధ్యానించుకొందాం.

**సాధారణంగా మానవులమైన అందరికి పరిమళ సువాసన అని అంటే చాల ఇష్టం ఎవరైనా మనషి సువాసన కలిగి ఉంటె మనం ఇష్టపడతాము.

**వాక్యభాగములో యేసుప్రభువారు మనకు పరిమళ సువాసనగా ఉన్నారు అని వ్రాయబడింది, అయన మనకు ఎలా ఏవిధంగా పరిమళ సువాసన ఉన్నారో బైబిల్ గ్రంధములో అయన గూర్చి మనం గమనిస్తే

1.మొదటిగా అయన పెదవులు మనకు పరిమళ సువాసనగా వ్రాయబడినది.
పరమగీతము 7:8
8 తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది.

**యేసుప్రభువారు ప్రియుడుగా, సంఘము ప్రియురాలిగా ఎలా పరిమళ సువాసనగా ఉండాలి అని పోల్చి ఇక్కడ వాక్యంలో వ్రాయబడినది.

పరమగీతము 5:13
13 అతని చెక్కిళ్లు పరిమళ పుష్పస్థానములు సుగంధవృక్షములచేత శోభిల్లు ఉన్నత భూభాగ ములు అతని పెదవులు పద్మములవంటివి ద్రవరూపక జటామాంసివలె అవి పరిమళించును.

**వాక్యంలో యేసుప్రభువారి పెదవుల నుండి వచ్చిన అయన మాటలను గూర్చి, అయన పలుకులు పరిమళాసువాసన వెదజిల్లునట్లుగా వ్రాయబడినది.

**ఆయన యొక్క పరిశుద్ధమైన మాటలు మనకు పరిమళ వాసనగా పోల్చబడినది.
 
**అయన మాటలు పరిమళ సువాసన కలిగినటువంటివిగా మాటలను విని అనేక మంది ఆయనను వెంబడించినట్లుగా, అయన మాటలను మూడురోజుల పాటు ఏమి తినక అనేక మంది విన్నట్లుగా బైబిల్ గ్రంధములో మనం చూడవచ్చు

మత్తయి 15:32
అంతట యేసు తన శిష్యులను పిలిచి జనులు నేటికి మూడు దినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను;
    
**అటువంటి పరిమళ సువాసన అయన మాటలను వింటున్నమనం, యేసుప్రభువారికి మనం పరిమళ సువాసనగా ఉండాలి.

2.రెండవదిగా యేసుప్రభువారి మధురమైన అయన నామం మనకు పరిమళ సువాసన

పరమగీతము 1:3
3 నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.

**దేవుని వాక్యంలో ఆయన యొక్క పవిత్రమైన నామము పరిమళ తైలముతో పోల్చబడినది.

**అందుకే యేసు అని నామము యందె రక్షణ అని దేవుని వాక్యంలో వ్రాయబడినది

అపొస్తలుల కార్యములు 4:12
12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి నామమున రక్షణ పొందలేము అనెను.

** లోకంలో మరి దేనివలన రక్షణ కలుగదు, సృష్టి కర్త ఐన అయన ద్వారానే మనకు రక్షణ.

**యేసు అను అయన నామము పరిశుద్ధమైనది పవిత్రమైనది.

**అందుకే పరిశుద్ధ గ్రంధములో అయన శిష్యులతో పలికిన మాటలను మనం గమనిస్తే, నా పేరుతో మీరు దెయ్యాలను వెళ్ళగొడతారు, అద్భుతాలు చేస్తారు, అయన నామం ఉచ్చరిస్తే ఆశ్చర్యకార్యాలు చేస్తారు అని వ్రాయబడినది.

**అయన నామంలో విజయం పొందుకుంటారు, అయన నామంలో ఏమి అడిగిన పొందుకుంటారు అని అయన పలికినట్లుగా మనం చూస్తాం.

యోహాను16:23
23 దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

**అటువంటి గొప్పదైన అయన నామమును వ్యర్థముగా ఉచ్చరించకుండా  ప్రేమించాలి, గౌరవించాలి, ఆరాధించు వారీగా మనం ఉండాలి

3.యేసుప్రభువారు మానవులమైన మనకు పరిమళ సువాసనగా ఉన్నారు.

ఎఫెసీయులకు 5:2
2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను;
 
**అయన మనకు చేసిన గొప్ప మేలు ఏమిటి అని ఆంటే అయన మనకు పరిమళ సువాసన ఉండుటయే.

**అయన మనకు పరిమళ సువాసన ఉండటానికి తనను తాను అప్పగించుకున్నారు.

**అయన అప్పగింపబడితేనే మనకు పరిమళ సువాసన, మరి మనం ఆయనకు పరిమళ సువాసనగా ఉండాలి అని ఆంటే యేసుప్రభువారి తోనే సాధ్యం.

ఈరోజున దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి బైబిల్ గ్రంధములో ఆవిషయంను గమనిస్తే 

పరిమళ సువాసన గూర్చి పరిశుద్ధ గ్రంధములో అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టు కొమ్మని అతనితో చెప్పెను.

ఆదికాండము 27:27
27 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది.

2 కొరింథీయులకు 2:15-16
15 రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము.
16 నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.

**సువాసన అనునది మానవులమైన మనకు సంతోషము కలిగించేది, అదేవిధంగా మన క్రియలు, పద్ధతులు క్రీస్తు బిడ్డలుగా ఆయనకు సువాసన కలిగించేవిగా ఉండాలి.

**మన క్రియలలో సువాసన కలిగి ఉండాలి, మనం సువాసనను ఇతరులకు పంచె వారీగా ఉండాలి.

4.నాల్గవదిగా మనం అభిషేకతైలము వలె సువాసన కలిగి ప్రకాశిస్తూ ఉండాలి.

పాతనిభందన గ్రంధములో అభిషేకతైలమును తయారు చేసేవారు, తైలము రెండు విధాలుగా తయారు చేసేవారు, ఒకటి అభిషేకతైలము, రెండు సుగంధ ప్రతిష్ఠాభిషేకతైలము.

నిర్గమకాండము30:23
23 పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తుల ముల యెత్తును
24 నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులము లును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని
25 వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభార ముగా చేయవలెను, అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.

**అటువంటి అభిషేకతైలము వలె మనం ఉండాలి, రోజున అపవిత్రులుగా ఉన్న మనలను పవిత్రపరచడానికి యేసుప్రభువారు మనకు పరిమళ సువాసనగ ఉన్నారు.

**మనం ఆయనతో ఉండాలి అని ఆంటే, అయన మనతో ఉండాలి అని ఆంటే మనం ఎప్పుడు సుగంధ పరిమతైలముతో ప్రకాశిస్తూ ఉండాలి, పరిమళ సువాసనగ ఉంటేనే దేవునితో ఉండే అర్హత మనకు కలుగుతుంది.

5. దేవుని వాక్యమును గమనిస్తే, దేవుని సేవకులైన వారికీ ఇచ్చేవి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన సువాసన.

ఫిలిప్పీయులకు 4:18
18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.

**ఇక్కడ పౌలుగారు పలికిన మాటలను మనం గమనిస్తే మీరు పంపిన వస్తువులు మాకు ఏది కొదువలేకుండా దేవునికి సువాసన ప్రితికారముగా ఉండినట్లుగా చెప్తున్నారు.

**అంతేకాకుండా షూనేమీయురాలైన దైవజనునికి సేవచేసి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన సువాసనగ ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం గమనించవచ్చు.

2రాజులు 4:8-9
8 ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన యొక స్త్రీభోజనమునకు రమ్మని అతని బలవంతముచేసెను గనుక అతడు మార్గమున వచ్చినప్పుడెల్ల ఆమె యింట భోజనము చేయుచువచ్చెను.
9 కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగు దును.
10 కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీప స్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బసచేయవచ్చునని చెప్పెను.

**అంతే కాకుండా సారెపతు విధవరాలు దైవజనునికి సేవచేసి దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన సువాసనగ ఉన్నట్లుగా మనం దేవుని వాక్యం గమనించవచ్చు
రాజులు 17:10
10 అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.

**సారెపతు విధవరాలు దైవజనునికి రొట్టెముక్కఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదముగా పొందుకున్నట్లుగా మనం గమనించవచ్చు.

**అందుకనే మనం దేవుని ప్రేమించువారిగా ఉండాలి, దేవుని సేవకులను గౌరవించువారిగా, వారీకి ఇచ్చువారిగా , దేవునికి ఇచ్చువారిగా ఉండాలి.

**మన క్రియలు ఇతరులైన వారిని యేసు ప్రభువారి చెంతకు వచ్చేవిధంగా సువాసన వెదజల్లే వారీగా ఉండాలి.

**క్రీస్తు సువార్త ప్రకటించువారిగా ఉండాలి, యేసయ్య నామము మనకు రక్షణ అని ప్రకటిస్తూ అటువంటి సువాసన కలిగి ఉండాలి.

**ఒక మాదిరికమైన జీవితం జీవిస్తూ, ప్రభువారి కొరకు పరిమళ సువాసన ఉండులాగున యేసయ్య దీవించాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్.
************************************************************


21July2019 I.E.H.C.ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.యేసు రత్నం విక్టర్ గారు
Topic:ఆశీర్వాదమునకు వారసులు

అపొస్తలుల కార్యములు 3:23-26
25 ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులై యున్నారు

ఇంటింటి సువార్త సేవ:-

**దేవుని కార్యములు ఏమైనా జరగాలి అని అంటే ఒక దర్శనం ఉంటుంది.

**దేవుని పని, దేవుని రాజ్యమును కట్టుటకు అంతటా దేవుని సువార్త ప్రకటించబడాలి అని దర్శనము కలిగి దేవుని సువార్త అందించబడుతుంది

** ఇంటింటి సువార్త సేవ మూడు పథకాలుగా ప్రక్రియ కొనసాగుతుంది, భారతదేశం అంతటా దేవుని సువార్త అందించబడుతుంది

**మొదటిగా 1966-74 కల్వరి పథకంగా, రెండవదిగా 1974-84 చివరంటి దీక్షగా, మూడవదిగా 1984-94 ఫాలో అప్ అనే ప్రక్రియగా ఇప్పటికి కొనసాగుతుంది.

**చదవబడిన వాక్యభాగములోని సందర్భమును మనము గమనిస్తే అపొస్తలుడైన పేతురుగారు వెండి బంగారము నావద్ద లేవుగాని "నజరేయుడైన యేసునామమున లేచి నడువమని ఆజ్ఞాపిస్తే అయన లేచి నడిస్తే " - యూదులందరు ఆశ్చర్య పడి అయన చేసిన  గొప్పకార్యము, తరువాత అయన చెప్తున్నా ఒక సాక్ష్యములోని, ఒక సందర్భములో మాటలను గూర్చి చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు.
ఈ ఉదయకాలమున మనం ధ్యానించుకోబోయే అంశం:- "ఆశీర్వాదమునకు వారసులు":-

"ఎవరు దేవుని ఆశీర్వాదానికి వారసులవుతారు? దేవుని యొక్క సంకల్పం ఏమిటి అని ఆలోచిస్తే"

**ఎవరు దేవుని మాటలు వింటారో, దేవుని కార్యములో పాలుపంచుకొంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు.

**దేవుడు మనలను ఆశీర్వదించబడుటకు మనలను పిలిచాడు, అయన సన్నిధికి రండి, వచ్చి దీవెనలు, ఆశీర్వాదం, విడుదల, స్వస్థత మనకు ఇవ్వాలని కోరుచున్నారు.

**అయన ఆశీర్వాదం పొందుకోవాలని అయన మందిరములో ఆయనను ఆరాధించుటకు అయన కార్యములో పాలు పంచుకోవటానికి మనలను ఏర్పాటుచేసుకున్నాడు.

ఉదయకాలమున దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులగుటకు మూడు రకముల తలంపులు దేవుడు మనతో పంచుకోవటానికి ఇష్టపడుతున్నాడు.

1.మొదటితలంపు అబ్రాహాము బట్టి భూమి యొక్క సకల జనులు ఆశీర్వాదానికి వారసులవుతారు.

దేవుడు అబ్రాహామును పిలిచి ఆయనతో అన్నమాటలను మనం గమనిస్తే
ఆదికాండము 12:1-2
1 యెహోవానీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ మును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.

**అబ్రాహాము దేవుని మాటలను బట్టి అనేక జనములకు ఆశీర్వాదమునకు వారసుడగునని దేవుడు చెప్పినట్లు, ఆలాగుననే మనం దేవుని సువార్త కొరకు, మనం దేవుని పని కొరకు, దేశమును, ఇంటిని విడిచి అయన కార్యములో ఉండేవారు ఆశీర్వాదమునకు వారసులవుతారు.

**దేవుని సేవ కొరకు దేవుని కార్యము కొరకు వెళ్ళాలి, లేదా వెళ్లే వారిని మనం పంపించువారిగా ఉండాలి., అప్పుడు దేవుని ఆశీర్వాదమునకు వారసులవుతాము.

2.రెండవ తలంపు మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు ఆశీర్వదమునకు వారసులగుదురు.

**ఏమిటి నిబంధన, అబ్రాహాముతో చెప్పిన నిభందన నీ నుండి అనేక రాజులొస్తారు ఆని, అబ్రాహాముతో చేసిన నిబంధన ఇస్సాకు వరకు, ఇస్సాకుతో చేసిన నిబంధన యాకోబు వరకు దేవుడు ఆశీర్వాదమును ఇచ్చాడు.

**మొదటిగా దేవుని నమ్మాలి, దేవుడిచ్చిన ఆశీర్వాదమును, అయన వాగ్దానములను నమ్మాలి, మన ద్వారా దేవుని కార్యములు జరగాలి

**దేవుని నిబంధనలకు వారసులగుటకు ప్రయత్నించాలి. మనము ఆశీర్వాదమునకు వారసులవ్వాలి. మనం అయన మాటలను వినేవారిగా కాకుండా అయన పరిచర్యలో పాలుపంచుకొనుటకు ప్రయత్నించాలి, మనమైతే దేశం కొరకు, సంఘము కొరకు ప్రార్దించువారిగా ఉండాలి

.

3.మూడవ తలంపు దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదమునకు వారసులగుదురు.
 అపొస్తలుల కార్యములు 3:23-26
26 దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

**మనకు దీవెన రావాలంటే, ఆశీర్వాదము రావాలంటే ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించి దేవుని పనులలో పాలు పంచుకోవాలి, మన వనరులను దేవుని కొరకు వాడాలి.మనము దేవుని పరిచర్య కొరకు ఒక తీర్మానం చేసుకోవాలి.

దేవుని మాటలు విని, దేవుని కార్యములో పాలుపంచుకొని, దేవుని పరిచర్య కొరకు ఒక తీర్మానం చేసుకోని, దేవుని ఆశీర్వాదము పొందుకొనువారిగా ఉండాలని ఆశిస్తూ.
 
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్...
********************************************************



28July2019ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరంగారు 
Topic: యెహోషాపాతు జీవితం. 
 
2దినవృత్తాంతములు 17:1-6
3 యెహోవా అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతు తన తండ్రియైన దావీదు ప్రారంభదినములలో నడచిన మార్గమందు నడచుచు
**యెహోషాపాతు, ఇశ్రాయేలీయుల రెండు గోత్రాల రాజ్యానికి రాజు, యెహోషాపాతు మంచి రాజు, ఆయన తండ్రి ఆసా కూడా మంచి రాజుగా ఉండేవాడు, అతని తల్లి అజుబా

**అయితే యెహోషాపాతు ఉత్తర ప్రాంతపు 10 గోత్రాల రాజ్యానికి రాజైన అహాబు, యెజెబెలు జీవించిన కాలంలోనే ఆయన జీవించాడు. యెహోషాపాతు కాలంలో చాలా సంవత్సరాలపాటు దక్షిణ ప్రాంతపు రెండు గోత్రాల రాజ్యంలోని ప్రజలు మంచి జీవితాన్ని అనుభవించారు

**చదవబడిన వాక్యభాగములో యెహోషాపాతు జీవితం, మనం ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలిసిన పాఠం గూర్చి ఈరోజు మనం ధ్యానించుకుందాం.  

1.మొదటిగా రాజైన యెహోషాపాతు ఆధ్యాత్మికంగా గొప్ప దైవ భక్తి కలిగినవాడు.

**యెహోషాపాతు దేవుని యెడల గొప్ప భయభక్తులు కలిగినవాడు.  

 **యెహోషాపాతు అనగా ఇది దేవునికి సంభందించిన పేరు, యెహోవా న్యాయం తీర్చును అని అర్ధం ఇస్తుంది.

**యెహోషాపాతు జీవితం నుండి నేర్చుకోవలసినది మనం కూడా దేవుని యెడల భయభక్తులు కలిగిన జీవితం ఉండాలి.

2.రెండవదిగా యెహోషాపాతు తన రాజ్యాన్ని బలపరచుకున్నాడు
2దినవృత్తాంతములు 17:1
1 తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన... యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండతన రాజ్యమును బలపరచుకొనెను.
 

**యెహోషాపాతు గొప్ప రాజు, శత్రువులనుండి తన రాజ్యాన్ని రక్షించుకోవటానికి, యితడు తన రాజ్యాన్ని స్థిరపరచు కున్నాడు, బలపరచుకున్నాడు.

**ఆధ్యాత్మికంగా మనం కూడా మన సంఘమనే రాజ్యాన్ని బలపరచుకోవాలి.

**సంఘమనే రాజ్యమును కాపాడుకోవలసిన భాద్యత సంఘనాయకులది, పెద్దలైనా వారిది, సంఘకాపరులది, దేవుని బిడ్డలుగా మన అందరిమీద ఉన్నది.

**దేవుని సంఘమును స్థిరపరచుకోవాలి, బలపరచుకోవాలి, దేవుని రాజ్యము కొరకు మనం భాద్యత కలిగి ఉండాలి.


3.మూడవదిగా యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను బట్టి నడచుకొనుటకు దృఢమైన మనస్సు కలిగినవాడు
2దినవృత్తాంతములు 17:4
4 బయలు దేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్ర యించుచు, ఇశ్రాయేలువారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలననుసరించి నడిచెను.

**యెహోషాపాతు యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడు, తన ప్రజలను, తాను దేవుని మార్గంలో నడిపించుటకు మనస్సులో దృఢమైన విశ్వాసం కలిగినవాడు.

**యెహోషాపాతు బయలు దేవతను ఆశ్రయింపక, ఇశ్రాయేలువారి చర్యలను వెంబడింపక, ఉన్నత స్థలములను దేవతాస్తంభములను యూదాలోనుండి తీసివేసి దేవుని యెడల, దేవుని ఆజ్ఞల పట్ల అతని మనస్సులో స్థిరమైన నిశ్చయం కలిగినవాడు.
   
**యెహోషాపాతు ఐశ్వ ర్యమును ఘనతయు మెండుగా కలిగెను. మనం దేవుని యెడల గొప్ప విశ్వాసంతో బ్రతికితే దేవుడు మనలను కూడా గొప్పగా చేస్తాడు

**మనం కూడా మన మనస్సులో యేసయ్య పట్ల స్థిరమైన విశ్వాసం కలిగి మన యేసయ్యకు తప్ప ఎవరికీ మన మనస్సులో చోటివ్వకూడదు, మన మనస్సులో యేసయ్యకు ఉన్నతమైన స్థానం ఇవ్వాలి.  

**మనం రోజున దేవుని బిడ్డలుగా కష్టము వచ్చిన, భాదవచ్చిన మనం మన యేసయ్యను మాత్రమే ఆశ్రయించువారిగా ఉండాలి, ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా ఉండాలి

**మన క్రియలు ఇతరులను, ఇతర దేవతలను ఆశ్రయించువారిగా కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి నడుచుకొనువారీగా దృఢమైన మనస్సు కలిగి ఉండాలి.

4.నాల్గవదిగా యెహోషాపాతు పెద్దల ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రమును తన జనులకు భోదించినవాడు. 

2దినవృత్తాంతములు17:7,9
9 వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేత పుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటనచేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.

**యెహోషాపాతు కొంతమంది పెద్దలైన వారిని ఏర్పాటు చేసుకొని తన జనులకైనా వారికీ దేవుని వాక్యమును వారి హృదయంలో పదిలంగా ఉంచుకొనుటకు దేవుని భర్మశాస్త్రమును, సువార్తను భోదించినవాడు.

**మనం కూడా త్రోవ తప్పి పోకుండా దేవుని వాక్యమును మన హృదయంలో కలిగి జీవించాలి, దేవునిలో బలపడటానికి ప్రయత్నించాలి.

** రోజున మనం యూదా రాజైన యెహోషాపాతు జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి దేవుని యెడల, దేవుని ఆజ్ఞల పట్ల దృఢమైన మనస్సు  కలిగి, యేసయ్యకు ఉన్నత స్థానం ఇస్తూ యేసయ్య చూపిన మార్గంలో నడచుకొని దేవుని సువార్త పట్ల సంఘము పట్ల భాద్యత కలిగి ఉండాలని అట్టి కృప మన అందరికి యేసయ్య ఇవ్వాలని ఆశిస్తూ.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

యేసయ్య మాటలను దీవించును గాక ఆమెన్