january 2021

 24Jan2021
ఆదివారం ఆరాధన
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
 
రోమీయులకు 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. 17 ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.  
 
        ఈరోజున చదవబడిన రోమా పత్రికలో మనం చుస్తే ప్రాముఖ్యమైన అంశములు పౌలు భక్తుడు మన కొరకు తెలియపరచారు. దేవుడు తన భక్తులైన వారిని తన ఆత్మతో నింపి పరిశుద్ద గ్రంధములో అనేకమైనటువంటి వాక్యాలను మన అందరిని అయన రాజ్యమునకు సిద్దపరచడానికి అయన భక్తులైన వారితో వ్రాయించారు. ఐతే పరిశుద్ద గ్రంధములో మనం చుస్తే మూడు భాగములుగా అనగా అవి పాతనిభందన గ్రంధము ఒక భాగము, కొత్తనిభందనలో మనం చుస్తే దేవుని యొక్క రక్షణ సువార్త గూర్చిన భాగము, మరియు పత్రికల భాగము మనకు కనిపిస్తుంది. ముఖ్యముగా సంఘము యొక్క సిద్దపాటును గూర్చి ఈ పత్రికలలో మనం చూస్తాము.
 
 రోమా సంఘానికి భక్తుడైన పౌలు గారు చెరసాలలో ఉన్నపుడు వ్రాసినది ఈ రోమా పత్రిక., ఇది ఒక ఆయువు పట్టువంటిది. ఈ రోమ పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు వ్రాయబడినవి అవి ఏమిటి అని అంటే ఈ రోమ పట్టణస్తులకు దేవుని సువార్తను గూర్చి ఆ సువార్తను ప్రకటించాలి, మరియు ఈ రోమా ప్రజలు నీతితత్వము కలిగి ఉండాలి అని రోమా పత్రికలో అయన చెప్తున్న ముఖ్య ఉద్దేశం. అయన అనేకమైన వ్యతిరేక పరిస్తితులలో ఉన్నప్పటికీ అయన చెప్తున్నా మాట ఏమిటి అని అంటే సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అని అయన చెప్తున్నారు అవును ప్రియులారా దేవుని విషయంలో దేవుని గూర్చిన సాక్ష్యము చెప్పుట విషయంలో ఏ మాత్రమూ సిగ్గుపడు వారిగా మనం ఉండరాదు. మనం మన ముందర ఉన్నవారు ఎంతటి గొప్పవారు కావొచ్చు ఎంతో గొప్ప జ్ఞానవంతులు కావొచ్చు ఐనా సరే క్రీస్తును గూర్చిన సువార్త చెప్పుటలో మనం సిగ్గుపడువారిగా మనం ఉండరాదు. మనం దేవుని గూర్చి ప్రకటించువారిగా అనేకులను దేవుని యొద్దకు నడిపించువారిగా మనం ఉండాలి.
 
ఐతే ఈ సువార్తలో ఏముంది అని మనం కనుక ఆలోచన చేస్తే. ఈ సువార్తను గూర్చి చాలా ప్రాముఖ్యమైన విషయాలను రోమా పత్రికలో ఆయన మనకు వివరిస్తూ వున్నాడు. 
 
సువార్త దేవుని యొక్క శక్తి
సువార్త అనగా మనలను నిర్మాణాత్మకంగా నడిపించేది, మనలను కట్టేది, కుటుంబాలను నిలబెట్టేది, జీవితాలను బాగుచేసిది. సువార్త అనునది అది దేవుని యొక్క నిర్మాణాత్మకమైన ఒక శక్తి మనలను పరలోకానికి నడిపించేది. నశించిపోయే ఆత్మ రక్షించేది సువార్త అందుకనే ఈ సువార్తను సిగ్గుపడకుండా ప్రకటించాలని అయన కోరుచున్నాడు. అటువంటి సువార్త ఈరోజున జరగకుండా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుచున్నాయి. ఆరోజులలో కూడా అలాంటి పరిస్తితులు ఉండేవి. కానీ ప్రియులారా ఈ సువార్త అనునది దేవుని యొక్క శక్తి అది మనలను బాగుచేస్తుంది. ఈ సువార్త ద్వార మనుష్యులకు రక్షణ కలుగుతుంది. అందుకే సువార్త అనేది మన అందరికి అవసరం మనం కూడా ఇతరులకు దేవుని యొక్క సువార్త చెప్పడం చాలా అవసరం.  
 
సువార్త ద్వార మనుష్యులకు విశ్వాసం పెరుగుతుంది.
అందుకే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును. ఇది క్రిస్తులో మన అందరికి అనుగ్రహించబడేటటువంటిది. నీతి అనేది దేవుని యొక్క రక్షణలో ప్రధానమైనటువంటిది, ఇది మనం దేవుని నుండి మనం పొందుకోవాలి, మనం కుడా నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవించాలి అని అంటే మనకు కావలసినది విశ్వాసము, అటువంటివారే నీతిమంతులుగా జీవించగలరు. ఇది భూప్రపంచములో ప్రతి మానవాళికి అవసరం. క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న లక్షణాలను మనము కలిగి ఉండాలి. అటువంటివారు నీతిమంతులుగా ఎంచబడుతారు.
 
ఇక్కడ ప్రాముఖ్యముగా నాలుగు విషయాలు మనకు ఈ రోమా పత్రికలో వివరిస్తూన్నాడు.
1.మొదటిది ఉగ్రతను గూర్చి వివరిస్తూ ఉన్నాడు.
దేవుని ఉగ్రత ఎలా వస్తుంది అని మనం ఆలోచిస్తే
రోమా 1:18 దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది.    
రోమా 2:5 నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.      
ఈ ఉగ్రత అనేది రకరకాలుగా ఉంటుంది ఇది దేవుని నుండి వచ్చే శిక్ష, ఇది అనేక రూపాలుగా మానవుల మీదకు రావొచ్చు. ఇది ఎవరి మీదకు ఐనా వస్తుంది. కానీ ప్రియులారా ఇది ఎవరి మీదకు వస్తుంది అని అంటే దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క భక్తిహీనత కలిగిన వారి మీద దేవుని ఉగ్రత వస్తుంది అని దేవుని వాక్యము చెప్తుంది. అటువంటి వారు నీతి కలిగి జీవించరు అంతే కాకుండా నీతి కలిగి జీవించే వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తారు అటువంటి వారిని అడ్డగిస్తారు.  ఆనాటి కాలంలో కూడా పరిసయ్యులు శాస్త్రులు యేసుప్రభువారిని ఎన్నో సార్లు అడ్డుకోనినట్లుగా మనకు తెలుసు. అయన సంచరించిరించినపుడు అనేకమార్లు నీతి కలిగిన ఆయనను అడ్డుకున్నారు అని బైబిల్ గ్రంధములో మనం చూస్తాం. ఈరోజులలో కూడా అటువంటి వారు ఉన్నారు మంచి చెప్పనివ్వారు, మంచి మాట్లాడనివ్వారు. మంచిపని చేయనివ్వరు వారు ఏదోరూపంలో మంచిని అడ్డుకుంటారు. ఎందుకు అని అంటే వారి దుర్నితి బయలుపడుతుంది అని.
 
అందుకే మనం ఏమి నేర్చుకోవాలి
మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే భక్తి కలిగి ఉండాలి. సరిగా వాక్యం ధ్యానించాలి, మందిరమునకు సరిగా రావాలి., దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అలాగున లేకపోతే భక్తిహీనత మనలో ఉంటె దుర్నితి మనలో ప్రవేశిస్తుంది, సత్యము అనేది మనలో ఉండదు. భక్తిహీనతతో వారు దేవుని ఎరిగి ఆయనను మహిమపరచరు, దేవునికి కృతజ్ఞతస్తుతులు చెల్లించరు. నిజమైన దేవుని ఎరిగి ఆయనను మహిమపరచక పోవుటయే భక్తిహీనత. అటువంటి వారిమీదకు దేవుని ఉగ్రత వస్తుంది.
 
అట్టివారు ఎలా ఉంటారు అని దేవుని వాక్యము చెప్తుంది అని అంటే
రోమా 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 29అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై 30కొండెగాండ్రును అపవాదకులును,దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును 31మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. 32ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
 
ఈరోజున మనం ఎలా ఉండాలి.    
పైన ఈలాంటి లక్షణములు కలిగిన వారిగా మనం ఉండరాదు. పౌలు భక్తుడు రోమా ప్రజలకు ఈలాంటి పరిస్తితి నుండి బయటకు రండి లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతారు అని అయన వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలైన వారి మాట ఎలా ఉండాలి అని అంటే అవును అంటే అవును కాదు అంటే కాదు అనులాగున ఉండాలి. వారు ఉన్నది ఉన్నట్లుగా చూసింది చూసినట్లుగా చెప్పాలి. కాని లేనిది ఉన్నట్లుగా కల్పించి చెప్పకూడదు. మనం దేవునికి చోటివ్వాలి, వాక్యమునకు చోటివ్వాలి, ప్రార్ధనకు చోటివ్వాలి లేకపోతే ఇటువంటి పరిస్తితులు వస్తాయి. అటువంటివి మనలో ఉంటె ప్రభువు దగ్గర వొప్పుకొని విడిచిపెట్టి అయన కొరకు జీవిద్దాం. మనం భక్తి కలిగినవారిగా దేవుని యెడల భయభక్తులు కలిగి పౌలు యొక్క ఉద్దేశం మనం కలిగి సువార్త ప్రకటించువారిగా ఉండాలి దేవుని ఉగ్రత తప్పించుకొను వారిగా ఉందాము., దేవుని యెడల భక్తి కలిగి జీవిద్దాం. 
 
యేసయ్య ఈ మాటలను దీవించును గాక
దేవునికి మహిమ కలుగును గాక          
        
  

No comments: