మార్చి Messages2019







03MARCH2019 Message
ఆదివారం ఆరాధన  
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య పాస్టర్ M.ఆనందవరం గారు
కీర్తనలు116,  ఆంధ్ర క్రైస్తవకీర్తనలు 8,239,573,386.
Topic:పాత్ర 

2తిమోతికి  2:20-22., 20 గొప్పయింటిలో వెండి పాత్రలును బంగారు పాత్రలును మాత్రమే గాక కఱ్ఱవియు మంటివియు కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింప బడును.

21 ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.

మన జీవితంలో అనేక రకాలైన పాత్రలు ఉన్నాయ్, వాటిని అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఈ పాత్రలు అనేవి మనకు మరియు ఇతరులకు ఉపయోగపడుటకు సాదృశ్యంగా ఉన్నాయి.వాటిలో ఘనత కొరకు కొన్ని ఘన హీనత కొరకు కొన్ని వాడుకలో ఉన్నాయి. ఈ పాత్ర అను పదమును మరియొక కోణంలో చుస్తే దేవుడు మనలను మంటి నుండి దేవుని కొరకు వాడబడే పాత్రలుగా తయారుచేసాడు. 

1.దేవుడు ఎందుకు మనలను పాత్రలుగా తయారుచేసాడు?

ఎందుకంటే దేవుని ప్రణాళిక చొప్పున అయన బిడ్డలుగా ఉండుటకు మనలను చేసాడు. 

2.దేవుని యెడల ఎటువంటి పాత్రలుగా మనం ఉన్నాము?

దేవుని యెడల ఎటువంటి క్రియలు కలిగి ఉన్నాము?

సంఘములో దేవుడుకొరకు  మనము నాలుగు రకములైన పాత్రలుగా వాడబడుచున్నాము.

అందులో ప్రధానమైన పాత్రలు:-


1.యవ్వన సమాజమనే పాత్ర

2.స్త్రీల సమాజమనే పాత్ర 

3.సండే స్కూల్ అనే పాత్ర 

4.సంఘకార్యవర్గమనే పాత్ర 

ఈ నాలుగు రకములైన పాత్రలుగా దేవుని కొరకు కడుగబడే పాత్రలుగా, దేవుని పాత్రలుగా వాడబడాలి. 

**పవిత్ర హృదయం కలిగి ఉండాలి. 

**యవ్వనస్తులు యౌవనేచ్ఛలను విడిచిపెట్టాలి.

**దేవుడు మనలో కోరుకొనే లక్షణములు కలిగి ఉండాలి. 

**దేవునికి అర్హమైన పాత్రలుగా ఉండాలి. 

ఇంకొన్ని పాత్రలను గూర్చి బైబిలును పరిశీలిస్తే 

1.మొదటిగా పరిశుద్ధుల ప్రార్థన పాత్ర

ప్రకటన గ్రంథము  5:8
ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిల పడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

**మనం ఒకరికోరు పరిశుద్ధ ప్రార్థనల పాత్రలుగా వాడబడాలి. 

**ఒక పక్షికి రెండు రెక్కలు ఎంత ముఖ్యమో

**ఒక విశ్వాసికి ప్రార్ధన, వాక్యము అనే రెండు రెక్కలను కలిగి జీవించాలి. 


2.రెండవదిగా క్రొత్త పాత్ర 

2రాజులు గ్రంథము 2:20 అతడుక్రొత్త పాత్రలో ఉప్పువేసి నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పెను. వారు దాని తీసికొని రాగా

21 అతడు ఆ నీటి ఊటయొద్దకు పోయి అందులో ఉప్పువేసి, యెహోవా సెలవిచ్చునదేమనగాఈ నీటిని నేను బాగు చేసి యున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగక పోవును. భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
22 కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాటచొప్పున ఆ నీరు మంచిదైయున్నది.

**మనం అటువంటి క్రొత్త పాత్రగా మార్చబడాలి. 

**దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించు వారీగా ఉండాలి. 

గొప్ప ఇంటిలో బంగారు, వెండి, కర్ర ,మంటి వంటి పాత్రలు ఎలాగ వాడబడుతాయో,

అదేవిధంగా మనం కూడా దేవుని సంఘమనే గొప్ప ఇంటిలో దేవుని కొరకు గొప్పగా వాడబడాలని

 అట్టి కృప దేవుడు మన అందరికి ఇవ్వాలి అని ఆశిస్తూ. 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్. 



దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక ఆమెన్.
-**********************************************************

10March2019 Sunday
ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యసందేశం Rev.M.ఆనందవరం గారు 
Topic: మనస్సు 
 
అపొస్తలుల కార్యములు  2:37-42., 37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా
38 పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 


**అన్నటికన్నా వేగంగా ప్రయాణించేది మనస్సు 
**ఈ మనస్సు ఏవిధంగా ఉన్నది అని దేవుని వాక్యమును పరిశీలిస్తే 
**బైబిల్ గంధములో ఈ మనస్సు గురించి చక్కగా వ్రాయబడింది.

1. మొదటిది చంచలమైన మనస్సు 
2థెస్సలొనీకయులకు 2:2  మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము. 

ఎందువలన ఈ చంచలమైన మనస్సు వస్తుంది?
ఎందుకంటే మనకు స్థిరమైన మనస్సు లేకపొతే వస్తుంది. 

మనము ఎలాంటి మనసు కలిగి ఉండుటకు ఆలోచన చేయాలి?
మనమైతే సంఘములో ఏక మనస్సు కలిగి ఉండాలి.
దేవుని బిడ్డలుగా స్థిరమైన మనసు కలిగి ఉండాలి.
 
2. రెండవది భ్రష్టమైన మనస్సు 
రోమీయులకు 1:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 

**భ్రష్టమైన అనగా చెడ్డమనస్సు అని అర్ధం.

ఎందుకు ఇటువంటి భ్రష్టమైన మనస్సు కొందరికి వస్తుంది?
ఎందుకంటే వారిమనస్సులో దేవునికి, దేవుని వాక్యమునకు  చోటులేక పోవుట వలన వస్తుంది.

మనము అటువంటి చెడ్డ మనస్సు కలుగకుండా ఏమి చేయాలి? 
మనకు అటువంటి చెడ్డ మనస్సు కలుగకుండా దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి.

3. మూడవది సమ్మతిగల మనస్సు 
కీర్తనల గ్రంథము 51:12 నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. 

***సమ్మతి అనగా స్వీకరించుట అని అర్ధం.
సమ్మతి గల మనస్సు కలిగి ఉండుట వలన సంఘమైన, కుటుంబమైనా బలముగా ఉంటుంది. 

ఏ విషయంలో సమ్మతించాలి? 
మంచి విషయములలో సమ్మతి గల మనస్సు కలిగిఉండాలి.

4.నాల్గవది పశువు మనస్సు 
దానియేలు 4:16 ఏడు కాలములు గడచువరకు వానికున్న మానవమనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును.
 
ఎందువలన రాజైన నెబుకద్నెజరుకు అటువంటి పరిస్థితి వచ్చింది? 
పశువు లాంటి మనస్సు కలిగి దేవునికి విరుద్ధంగా చెడ్డ కార్యములు చేయటం వలన రాజైన నెబుకద్నెజరు  ఇంచుమించు రెండు సంవత్సరములు పైగా అరణ్యములో ఉండవలసి వచ్చింది.

**మనమైతే దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి.

5. ఐదవది మారు మనస్సు
అపొస్తలుల కార్యములు  2:38 పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. 

మారుమనస్సు కలిగి దేవునిలో ఎదగాలి దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి.
 
ప్రభువు ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
---*****************************************-----------
17March2019 Sunday
విశ్వవాణి ఆదివారం 2019
కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ ఫౌండర్స్ డే
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.G. ఐజయ్య గారు.
 Topic: సువార్తీకరణ.

యెషయా గ్రంథము 51:1-7
1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండనుండి చెక్కబడితిరో దాని ఆలో చించుడి మీరు ఏ గుంటనుండి తవ్వబడితిరో దాని ఆలో చించుడి
   
1.ఎందుకు సువార్త సేవ చేయాలి?
సామెతలు 11:30 నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు.

ఇతరులను రక్షించు దేవుని వాక్యమును ఇతరులకు చెప్పవలసిన బాధ్యతను దేవుడు మనకు అప్పగించారు.  

2.సువార్తీకరణకు మనం ఏమి చేయాలి? 
**మొదటిగా యేసయ్య శిష్యులుగా చేయాలి.
**యేసయ్య శిష్యులైన వారికీ బాప్తిస్మము ఇవ్వాలి. 
**దేవుని వాక్యం వారికీ అందజేయాలి.
**దేవుని వాక్యం కొరకు ప్రార్ధనలో కనిపెట్టాలి. 

3.పౌలు భక్తుడుగారు గొప్ప సువార్త సేవను ఎలా చేసారు?
**సౌలు గారు దేవుని స్వరానికి విధేయులై గొప్ప సువార్త సేవను చేసారు.

4. పౌలు భక్తుడుగారు సువార్త చేసిన సంఘములు.
రోమీయులు; కొరింథీయులు; గలతీయులు; ఫిలిప్పీయులు; కొలొస్సయులు; థెస్సలొనీకయులు; తిమోతి; తీతు; ఫిలేమోను; హెబ్రీయులు.

**మిషనరీ వ్యవస్థను కనుగొన్న రెండవ వ్యక్తి పౌలు గారు. 

**అయన ఈ సువార్త గురించి రోమా పత్రికలో పలికిన మాటలను గమనిస్తే అయన సువార్తను దేవుని శక్తి అని అభివర్ణించారు.
రోమీయులకు 1:15-16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.
 
5.తోమా గారు క్రీస్తు శకం యాభైరెండవ కాలంలో సువార్త పరిచర్య చేసారు, మరియు అనేకమందిని ప్రభువులోని నడిపించారు.

6.విలియం కెరిగారు అద్భుతమైన సేవ చేసారు.

మరి మనం ఎలా ఉన్నాము ఈ దినాలలో అటువంటి సేవ చేస్తున్నామా?

మరి మనం ఎలా ఈ సువార్త సేవలో భాగస్వాములం అవ్వాలి? 
1 కొరింథీ16:1-4.,1 పరిశుద్ధులకొరకైన చందావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి.

2 నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. 

**సువార్త ప్రకటించు పెదవులుగా ఉండాలి.
**దేవుని సువార్త సేవ కొరకు ప్రార్ధించాలి. 
**దేవుని పరిచర్య కొరకు పరిగెత్తాలి. 
**దేవుని సువార్త కొరకు ఆర్ధికంగా సహాయ పడాలి.
 **భక్తుడైన పౌలు గారు చేసిన సువార్త సేవ చేయాలి.

యేసయ్య ఈ మాటలను దీవించునుగాక  ఆమెన్.

దేవునికి మహిమ కలుగును ఆమెన్.           
 ********************************--------------------

24March2019 Sunday
ఆదివారం ఆరాధన బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్య పరిచర్య Rev.M.ఆనందవరంగారు.
Topic:వేషధారణ 

మత్తయి 7:1-5
వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును.
 
వేషధారణ అనగా వేషమును ధరించుట అని అర్ధం.
ఈ వేషధారణలో నటన, మోసం, అబద్దం దాగిఉన్నవి, ఇది చాల ప్రమాదకరమైనది. 
 బైబిల్ గ్రంధమును పరిశీలిస్తే ఈ వేషధారణ గూర్చి మూడు విషయాలు గమనించవచ్చు.

1.మొదటిగా ప్రార్ధన విషయంలో వేషధారణ
మత్తయి 6:5
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 

మరి మనము ఏవిధంగా ప్రార్ధన చేయాలి?
మత్తయి 6:6 నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.

2.రెండవదిగా ఉపవాసము చేయునపుడు వేషధారణ
మత్తయి 6:16 మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

మన ఉపవాసము దేవునికి కనిపించాలి అప్పుడు దేవుడు మనకు తగిన ఫలము ఇస్తాడు.

3.మూడవదిగా ధర్మమును చేయునపుడు వేషధారణ
మత్తయి 6:2 కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 

వేషధారుల క్రియల గూర్చి యేసయ్య ఏమిచెప్తున్నాడు.
మత్తయి  7:1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
మత్తయి 7:3-4., 3 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?

ఈ వేషధారులు ఏమి చేయుచున్నారు.
మత్తయి 15:6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

మత్తయి 23:6 విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత విధులలో వందనములును మనుష్యులచేత భోదకులని పిలువబడుటయు కోరుదురు.

ఇలాంటి వారు ఏమి మూసివేస్తున్నారు?
ఇలాంటి వారు దేవుని రాజ్యమును మూసివేస్తున్నారు. 
మత్తయి 23:13-14 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;  
14 ​మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. 

ఈ వేషధారులు ఎలా ఉన్నారు?
మత్తయి 23:23,25,27,29 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. 

**వారు సున్నముకొట్టిన సమాధులను పోలియున్నారు.

**వారి శుద్ధి లోపల దోపుతోను అజితేంద్రియత్వము తోను నిండియున్నవి.

**వారు ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు.

 బైబిల్ గంధములో ఈ వేషధారణకు సంబంధించి అనేక విషయాలు వ్రాయబడినవి.

**దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన ఆకాను వేషధారణను మనము గమనించవచ్చు.

** దేవుడైన యెహోవాకు విరోధముగా తన తమ్ముడిని చంపిన కయీను వేషధారణను మనము గమనించవచ్చు.

**నయమాను తీసికొని వచ్చిన వాటిని అంగీకరించిన గేహజీ వేషధారణను మనము గమనించవచ్చు.

**భూమి వెలలో కొంత దాచుకొని మోసపుచ్చిన సప్పీరా వేషధారణను మనము గమనించవచ్చు.

ఈ రోజున మనము ఎలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు.

**మనము మారుమనస్సు పొందాలి.
**మనము హెచ్చరించబడాలి.
**మనము ఖండించబడాలి.
**హృదయపూర్వక భక్తిని కలిగి ఉండాలి.
**దేవుని వాక్యము ద్వారా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి.

మనము తప్పులు పొరపాట్లు సరిచేసుకొని దేవుని రాజ్యము కొరకు వేచిఉందాం.

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.



యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్.

----------***********************************************-----------------------
31March2019 Sunday

ఆదివారం ఆరాధన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.E.శామ్యూల్ గారు
విశ్వవాణి స్టేట్ సెక్రటరీ

Topic: సిలువ విలువ
 
గలతీయులకు 6:11-18
14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక; దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువవేయబడియున్నాము.

**గలతి సంఘము ఆధ్యాత్మికంగా విశ్వాసములలో స్థిరత్వమూ లేని కారణమున పౌలు గారు ఈ సంఘమును గూర్చి హెచ్చరించుచు వ్రాస్తున్నారు.
గలతీయులకు1:6
 క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది.

**అనేకమైన బలహీనతలు కలిగిన ఈ గలతి సంఘము దోషనివారణ నిమిత్తము, పాపము నిమిత్తము, యేసుప్రభువారు సిలువబడివేయబడునట్లుగా తెలిసిన, వీరు అవివేకులుగా శరీరసంభందమైన విషయములో అతిశయించుచున్నారు.
 గలతీయులకు3:1
ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!

**దేవుని బిడ్డలుగా ఉండుటకు, సున్నతి కొరకు, లోకసంభందమైన వాటికొరకు అతిశయింపరాదు.

పౌలుగారు సిలువను అతిశయించుటకు అనేక విషయములు ఉన్నవి. 

**అయన గమలీయేలు ప్రవక్త వద్ద శిష్యరికం చేసిన గొప్పఆధిక్యత కలిగినవాడు.

**అయన యుధామత  ప్రతిష్టుడు , హెబ్రీయుడును, బెన్యామీను గోత్రము సంబంధుడు.

**ఐనను క్రీస్తును బట్టి అయన సిలువ నందు తప్ప మరి వేటి యందు అతిశయింపనని అంటున్నాడు. 

క్రైస్తవ జీవితంలో అత్యంత విలువైనది, ప్రధానమైనది ఏమైనా ఉన్నది ఆంటే అది సిలువే.

**విలువ లేని ఈ సిలువకు యేసుప్రభువారు విలువనిచ్చారు. 

**ఎప్పుడు అసహ్యించుకునే గాడిదకు యేసుప్రభువారు ఎక్కినా తరువాత విలువ వచ్చింది, పామరులను పండితులుగా చేసారు. 

**యేసు ప్రభువారి ఈ సిలువ శ్రమ, మరణ - పునరుద్ధణలు జ్ఞాపకం చేసుకొంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. 

ఈ సిలువ విలువను గూర్చి ఎందుకు అతిశయించాలి బైబిల్ గ్రంధము పరిశీలిస్తే. 

1.మొదటిగా ఈ సిలువ వలన ద్వేషం సంహరించబడినది.

ఎఫెసీయులకు 2:16 తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు.

**ఇక్కడ ద్వేషం ఆంటే దేవునికి మానవునికి మధ్య పాపమనే ద్వేషం యేసు ప్రభువారి సిలువ ద్వారా సంహరించబడినది అని అర్ధం.

**మనం అనుభవించవలసి భాదను శిక్షను యేసయ్య అనుభవించి తద్వారా మనకు రావలసిన శిక్ష కొట్టి వేయబడినది.

** ప్రతి క్రైస్తవుడు, సంఘము, సిలువను బట్టి అతిశయించాలి.

2.రెండవదిగా ఈ సిలువ మనలను దేవునితో సమాధానపరచినది.

**పవిత్రమైన యేసయ్య రక్తము ద్వారా ఈ సిలువకు మనలను సమాధానపరచింది.

**దేవుని కుమారులుగా, దైవసంతానంగా గుర్తింపబడటానికి కారణం ఈ సిలువ. 

**దేవునితో మనలను సమాధానపరచి ఈ సిలువకు ఇంత గొప్ప విలువ వచ్చింది. 

3.మూడవదిగా ఈ సిలువ జయోత్సవముతో వేడుకగా కనుపరచెను. 

కొలొస్సయులకు2:15 ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.

**జయోత్సవముతో వేడుకగా కనపరచు ధాన్యతను సమాజానికి, సంఘమునకు, మనకు యేసు ప్రభువారు ఈ సిలువ ద్వారా అందించారు.

**అంత గొప్ప విలువ ఈ సిలువకు కలిగింది.

**మనం మేలైనది చేయకుండుటయే పాపమని దేవుని వాక్యములో వ్రాయబడినది. 

**సిలువ గొప్పతనము యందు మనం అతిశయించు దేవుని బిడ్డలుగా దేవుని కృప కలిగి జీవిద్దాం. 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక ఆమెన్. 

దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.