07june2020 Sunday Message


ఆదివారము ఆరాదన
బాప్టిస్ట్ చర్చి అక్కయ్యపాలెం
వాక్యపరిచర్య Rev.M.ఆనందవరం గారు
అంశం : చేపట్టుడి

హెబ్రీయులకు 10:23 వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము.

చదవబడిన వాక్యంలో మనం ధ్యానించు కోబోయే మాట పట్టుకోనుడి. సాదారణంగా  మన జీవితంలో విలువైనటువంటివి మరియు  అధ్యాత్మికమైనటువంటివి ఇలా చాల ఉన్నాయి. మన జీవితంలో విలువైనటువంటి వాటిని జాగ్రతగా పట్టుకొని ఉంటాము.

ఈరోజున మనం ఏమి గట్టిగా చేపట్టాలి అని మనం ఆలోచిస్తే. పరిశుద్ద గ్రంధములో కీర్తనాకారుడు దావీదు పలికిన మాటలను మనం గమనిస్తే కీర్తనల గ్రంథము 116:12 యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును? 13 రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. మన జీవితంలో ఈ విలువైనటువంటి రక్షణను ఏవిధంగా చేత పట్టుకొని ఉండాలి. ఇక్కడ వాక్యంలో మనం చుస్తే దావీదు ఈ రక్షణను చూస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈరోజున మనం కుడా యేసుప్రభువారు మన కిచ్చిన విలువైనటువంటి రక్షణ పాత్రను చేతపట్టుకొని చూడాలి అది వెలపెట్టికొనలేనిది. ఈరక్షణ అముల్యమైనది, నిర్దోషమును, నిస్కలంకమైన యేసుప్రభువారి రక్తముచేత మనలను కొని రక్షించిన ఈ రక్షణను మనం చూడాలి. అది ఎంత విలువైనటువంటిదో, ఈ రక్షణను ఇవ్వడానికి యేసుప్రభువారు నాకు ఏమిచేసారో అని ఆలోచిస్తే అయన దేవాది దేవుడిగా ఉండి కూడా పరలోకమును విడిచి ఈలోకమునకు వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అది వేలకట్టలేనటువంటి అటువంటి ఈ రక్షణను చేతపుచ్చుకొని నిత్యమూ రక్షణ మార్గములో నడచుకొని మనము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 

ఈరోజున మనం ఏమి చేపట్టాలి, దేవుని వాక్యం మనకు ఏమి చెప్తుందో కొన్ని విషయాలను బైబిల్ గ్రoదములో మనం ధ్యానించుకొందాము.

1.మొదటిగా మనం అయన ఉపదేశమును చేపట్టువారిగా ఉండాలి
కొరింథీయులకు 15:2 మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.
ఏమి మనం గట్టిగా పట్టుకోవాలి అని అంటే విలువైన మన రక్షణ కారకమైన అయన చేసిన ఉపదేశమును అయన మనకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకోవాలి. అయన ఉపదేశము ద్వారా మనతో మాట్లాడిన మాటలను అ దేవుని వాక్యమును గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు అని అంటే మన జీవితంలో మనలో ఆసహ్యములైన క్రియలను సరిచేసుకోవడానికి, మనలను బాగుచేయడానికి దేవుని సేవకుల ద్వార పలికిన మాటలను మనం స్వీకరించి వాటిని అనుసరించాలి. అది గట్టిగా పట్టుకోకపోతే సాతాను వాటిని పట్టుకొని తీసుకుపోతాడు అప్పుడు అవి మనలో ఫలించవు. అందుకే మనం వాటిని జాగ్రతగా వినాలి వాటిని గట్టిగా పట్టుకోనాలి. ఆవిధంగా చేస్తే మనకు కలిగే లాభం ఏమిటి అని అంటే ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్నయెడల ఆ సువార్త వలననే మీరు రక్షణపొందువారై యుందురు. ఈరోజున ఆ విలువైన మన రక్షణ కారకమైన ఉపదేశమును మనం వినాలి వాటిని గట్టిగా చేతపట్టుకోవాలి.

2.రెండవదిగా దృడవిశ్వాసమును గట్టిగా చేపట్టువారిగా ఉండాలి. 
హెబ్రీయులకు 3:15 ఏలయనగా మొదటనుండి మనకున్న దృఢ విశ్వాసము అంతముమట్టుకు గట్టిగా చేపట్టినయెడలనే క్రీస్తులో పాలివారమై యుందుము.
దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాద్యం. ఈరోజున మనం ఎటువంటి విశ్వాసము గలవారమై ఉండాలి అని అంటే దృఢమైన విశ్వాసముతో, అంతము మట్టుకు గట్టిగా చేపట్టువారిగా మనం ఉండాలి. ఈరోజున ప్రియమైన వారలారా మన విశ్వాసం ఎంత ఉందొ పరీక్షా చేసుకోవాలి అది నమ్మకంగా ఉండాలి చెదిరిపోకుండా దృడంగా ఉండాలి. మనలో ఎల్లప్పుడు దృడమైన విశ్వాసమును నింపుకోవాలి. యేసుకోసం మనం ఏదైనా వదులుకోనేవారిగా మనం సిద్దంగా ఉండాలి ఆవిధంగా మనం మన ప్రుభువుతో చెప్పగలిగే వారిగా ఉండాలి. ఈరోజున మనం లోకాశాలను విడిచి యేసయ్య పైన దృడ విశ్వాసమును కలిగి అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. 
 
3.దైర్యము నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టుకోనువారిగా ఉండాలి
హెబ్రీయులకు 3:6 అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
ప్రియులారా మనం ఏమి చేపట్టుకోవాలి అని అంటే పరలోకం సమీపిస్తుంది మనకు ప్రభువుతో ఉండే భాగ్యం మనకు కలుగుతుంది అని అటువంటి నిరీక్షణ వలన కలిగిన ఉత్సాహమును, ధైర్యమును చేపట్టుకొని ఉండువారిగా మనం సిద్దపడి ఉండాలి. ఈరోజున భయము అనేది శారీరకముగా మరియు ఆధ్యాత్మికంగా చాల ప్రమాదకరమైనటువంటిది. అందుకే మనం ప్రతి విషయంలో దైర్యము కలిగి ఉండాలి ప్రభువు మనకు తోడై ఉండగా మనం ఆయనపై నిరీక్షణ కలిగి, శాస్వతమైన దేవుని రాజ్యమును గూర్చి సిద్దపాటు కలిగి ఉండాలి. మన జీవితంలో మనం దేనికి భయపడక అది వ్యాధి ఐన మరి ఏదైనా వాటి అన్నిటిలో దైర్యమును మనలో నింపుకొని ప్రభువుతో నివసించే పరలోకమును గూర్చి ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టుకొని జీవించాలి. 

4.మనకు భోదింపబడిన విధులను చేపట్టువారిగా మనం ఉండాలి
థెస్సలొనీకయులకు 2:14-15 మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను.15 కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి.
క్రైస్తవ జీవితములో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని అంటే మనకు భోదింపబడిన విధులను, కట్టడాలను చేపట్టువారిగా మనం ఉండాలి. అది యవ్వనస్తులైన, స్త్రిలైన, పెద్దవారైన ఎవరు ఎలా ఉండాలో ఆ పద్దతులను నియమాలు నిభందనలను పాటించాలి వాటిని అనుసరించాలి., మన జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనకు భోదింపబడిన విధులను చేపట్టువారిగా మనం ఉంటె దేవుని గొప్పదైన ఆశీర్వాదాలను మనమందరం పొందుకొంటాము. 

5.నమ్మదగిన భోదను గట్టిగా చేపట్టువారిగా మనం ఉండాలి.
తీతుకు 1:9 తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.
నమ్మదగిన భోదలలో చాల రకములైనవి ఉన్నాయి., వాటిలో హితబోధవిషయమైన, ఆరోగ్యకరమైన వాటిని మనం అనుసరిస్తూ అటువంటి భోదను గట్టిగా మనం చేపట్టాలి దానిని అనుసరించాలి.

ముగింపు:-ఈరోజున మనం ఉదేశయుక్తమైన భోదను గట్టిగా పట్టుకోవాలి దాని వలన మనకు ఏమి కలుగుతుంది అని అంటే మనకు రక్షణ కలుగుతుంది. మనం దృడమైన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి దాని ప్రయోజనము ఏమిటి అంటే క్రీస్తుతో కుడా పాలివారమైఉంటాము, అటువంటి భాగ్యము మనకు కలుగుతుంది. దైర్యము నిరీక్షణ ఉత్సాహమును కలిగి వాటిని గట్టిగా పట్టుకొని ఉండాలి, అప్పుడే అయనే మన ఇల్లుగా మనం ఉంటాము. అంతే కాకుండా మనకు భోదింపబడిన విధులను చేపట్టువారిగా మనం ఉంటె మనం యేసు క్రీస్తు వారి మహిమను మనం కలిగి ఉంటాము. ఆఖరిగా అయన నమ్మదగిన భోదను గట్టిగా చేపట్టువారిగా ఉంటె మనకు జ్ఞానం మంచి ఆలోచన పెరుగుతుంది, మన జీవితం మారుతుంది. అట్టి కృపతో యేసయ్య మన అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్. 

యేసయ్య ఈ మాటలను దీవించును గాక.
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

 

 

 

 

 

 

 

 

 

No comments: